Sunday, 24 May 2026
  • Home  
  • టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యకు ఘన సన్మానం
- తిరుపతి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్యకు ఘన సన్మానం

శ్రీ కాళహస్తి, మే 24, (పున్నమి న్యూస్): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన స్థానిక నేత సుబ్బయ్యకు పట్టణంలో ఘన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు చెక్కుడు కుప్పం షణ్ముగం రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీన వర్గాల ఆశయాలతో ఏర్పడిన పార్టీ అని పేర్కొన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించాలనే లక్ష్యంతో నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించారని, గిరిజనులు పరిపాలించే స్థాయికి ఎదగాలన్నదే టీడీపీ ఆకాంక్ష అని తెలిపారు. మహావీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో నేడు గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారన్నారు. అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన సుబ్బయ్య సేవలను గుర్తించి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం గర్వకారణమని షణ్ముగం రెడ్డి కొనియాడారు. యానాది సామాజిక వర్గానికి పరిపాలించే సామర్థ్యం ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. దేశ అత్యున్నత పదవిలో ద్రౌపది ముర్ము వంటి గిరిజన మహిళ ఉండటం ఎస్టీ సామాజిక వర్గాల ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులో సుబ్బయ్య మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్, స్థానిక నాయకులు, యానాది సామాజిక వర్గ పెద్దలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుబ్బయ్యను ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.