Thursday, 9 July 2026
  • Home  
  • విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి – ఏఐఎస్ఎఫ్ నేత తబ్రేజ్ ఖాన్
- ఆదిలాబాదు

విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి – ఏఐఎస్ఎఫ్ నేత తబ్రేజ్ ఖాన్

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 10న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కో-కన్వీనర్ తబ్రేజ్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు బంద్‌కు సహకరించి విద్యారంగ సమస్యల పరిష్కారానికి మద్దతు తెలపాలని కోరారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలకు శాశ్వత సొంత భవనాలు నిర్మించాలని, ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.