ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (జూన్ 30) ఖమ్మం జిల్లాలో చేపట్టాల్సిన పర్యటనను రద్దు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకావడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాల్సి ఉండగా, వర్షాల కారణంగా పర్యటనను వాయిదా వేసినట్లు సమాచారం. ప్రజల భద్రత, రవాణా పరిస్థితులు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీని ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పర్యటన ఏర్పాట్లు చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సమాచారం.



