Monday, 25 May 2026
  • Home  
  • రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌కు రైతుల నిరసన.. నిలిపివేయాలని డిమాండ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌కు రైతుల నిరసన.. నిలిపివేయాలని డిమాండ్

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 25 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద ఏర్పాటు చేస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌కు వ్యతిరేకంగా సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ప్రాసెసింగ్ యూనిట్ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు కండలేరు క్రీక్‌లో కలిస్తే నీరు విషపూరితమై వ్యవసాయం, రొయ్యల సాగుకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణపట్నం వద్ద కండలేరు ముఖద్వారం చిన్నదై వరద నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండా యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే యూనిట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 25 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద ఏర్పాటు చేస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌కు వ్యతిరేకంగా సోమవారం రైతులు ధర్నా నిర్వహించారు. ప్రాసెసింగ్ యూనిట్ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలు కండలేరు క్రీక్‌లో కలిస్తే నీరు విషపూరితమై వ్యవసాయం, రొయ్యల సాగుకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణపట్నం వద్ద కండలేరు ముఖద్వారం చిన్నదై వరద నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. పంచాయతీ అనుమతి లేకుండా యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే యూనిట్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.