పెట్రో ధరల పెంపుపై స్పందించిన రాహుల్ గాంధీ
పున్నమి న్యూస్
25 మే 2026
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేత Rahul Gandhi తీవ్ర స్థాయిలో స్పందించారు. “మోదీ మళ్లీ తన పనితనం చూపించారు” అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు.
ప్రజల జేబులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారని, దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతుందని తాను కొంతకాలంగా చెబుతున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పెట్రో ధరల పెంపు ఇప్పుడే ప్రారంభమైందని, ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, పెరుగుతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని వస్తువుల ధరలపై పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.




