Thursday, 3 September 2026
  • Home  
  • రైతుల కష్టాలు కూటమికి పట్టవా?: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధ్వజం
- నంద్యాల

రైతుల కష్టాలు కూటమికి పట్టవా?: మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ధ్వజం

నంద్యాల:శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 873 అడుగుల నీటి నిల్వలు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతానికి నీటిని విడుదల చేయకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నంద్యాల మండలం కానాల చెరువును స్థానిక నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా నష్టాల్లో ఉన్న రైతులకు ఈ ఏడాదైనా నీళ్లు వస్తాయనే ఆశ అడియాశగా మారిందన్నారు. పంటలు సాగు చేయవద్దని చెబుతున్న అధికారులు, రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 90 శాతం పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పనులను కూటమి ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఆరోపించారు. ‘అన్నదాత సుఖీభవ’, ఉచిత పంటల ఇన్సూరెన్స్ పథకాలు అమలు కావడం లేదని మండిపడ్డారు. కానాల చెరువులో మట్టి తవ్వకాలపై అధికారులు తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, తాగు, సాగు నీరు వెంటనే విడుదల చేసి రాయలసీమ ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.