ఆత్మకూరు, ఆగస్టు 20 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జేఆర్ పేటలో 128, 130 బూత్‌లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించారు.రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలతో, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనల మేరకు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి మెరుగైన పాలన అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు.4వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు దాసరి మధుసూదన్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 4వ వార్డు అధ్యక్షుడు కాపా వెంకట్ సుబ్బయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి తోడేటి వెంకటయ్య, యూనిట్ ఇన్చార్జి దాసరి బాలకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు షేక్ నాయబ్ రసూల్ (చిన్న), 130వ బూత్ ఇన్చార్జి మునగల వెంకటరమణ, బీజేపీ నాయకుడు కాట మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 128వ బూత్‌లో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు.

రెండేళ్ల నమ్మకం.. ఇంటింటా అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం