Wednesday, 22 July 2026
  • Home  
  • రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైయస్సార్సీపి మహిళా విభాగం ఆందోళన
- తిరుపతి

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైయస్సార్సీపి మహిళా విభాగం ఆందోళన

పున్నమి ప్రతినిధి , తిరుపతి జూలై 21 ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు, గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనతో పాటు మహిళల భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిన నేప థ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, మహిళలకు రక్షణ కల్పించా లని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు, బూత్ కమిటీ అధ్యక్షురాలు సాయిలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు కనీస భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ దిక్కులేని రాష్ట్రంగా మారిందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టి, వారికి సంపూర్ణ రక్షణ కల్పించేలా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

పున్నమి ప్రతినిధి , తిరుపతి జూలై 21

ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు, గుంటూరులో మహిళను వివస్త్రను చేసిన ఘటనతో పాటు మహిళల భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిన నేప థ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న డా. బిఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, మహిళలకు రక్షణ కల్పించా లని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు, బూత్ కమిటీ అధ్యక్షురాలు సాయిలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు కనీస భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ దిక్కులేని రాష్ట్రంగా మారిందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలను అరికట్టి, వారికి సంపూర్ణ రక్షణ కల్పించేలా ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.