విశాఖపట్నం జిల్లా, రుషికొండ, పున్నమి ప్రతినిధి ఆగస్టు 18::: మధురవాడ–మారికవలస–రుషికొండ తిమ్మాపురం వెళ్లే రోడ్డు ప్రధాన రహదారిపై లారీల నుంచి మట్టి, ఇసుక, రాళ్లు, కంకర, సిమెంట్ అవశేషాలు పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం ఉండటంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
మధురవాడ, రుషికొండ ప్రాంతాల ప్రజలతో పాటు ఐటీ ఉద్యోగులు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. నిర్మాణ సామగ్రిని తరలించే లారీలను సక్రమంగా కప్పి తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఇసుకను వెంటనే తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.
Uploaded Video:





