✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలోని ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం పడుతున్న కష్టాలను సోషల్ మీడియాలో చూసి వెంటనే స్పందించిన మన కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందం గారి ఆదేశాలతో ఆ కుటుంబానికి గొప్ప భరోసా దక్కింది. మన ఎమ్మెల్యే గారి చొరవతో ఆర్డీవో, ఎమ్మార్వో, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పార్టీ నాయకులు స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లి వారి బాగోగులు తెలుసుకున్నారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ. 10,000 అందజేయడంతో పాటు, వారింటికి కరెంటు సదుపాయం కల్పించి, పెన్షన్ వచ్చేలా అన్నీ ఏర్పాట్లు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్ట్‌కు సైతం ఇంతలా స్పందించి ఆదుకున్న ఇలాంటి గొప్ప నాయకుడు మనకు ఉండటం మన అదృష్టం. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన మన ఎమ్మెల్యే బండారు సత్యానందం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు!
END

