వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ వివిధ పార్టీ కమిటీలలో బాధ్యతలు నిర్వహిస్తున్న క్రియాశీలక నాయకులు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని పార్టీ నిర్ణయించింది. అక్టోబర్ 1, 2026 తర్వాత మరణించిన నాయకుల కుటుంబాలకు ఈ కార్యక్రమం వర్తిస్తుంది.
ఆర్థిక సహాయం పొందేందుకు మరణించిన వ్యక్తి పార్టీ క్రియాశీలక సభ్యుడై ఉండటంతో పాటు పార్టీ ఐడీ కార్డు పొంది ఉండాలి. అలాగే FIR కాపీ, పోస్టుమార్టం రిపోర్ట్ లేదా పంచనామా తప్పనిసరిగా సమర్పించాలి. గ్రామ/వార్డు అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుల సిఫార్సుతో ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త పూర్తి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలి. నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డు కూడా జత చేయాలి. అవసరమైన పత్రాలను త్వరితగతిన సమర్పించాలని పార్టీ కేంద్ర కార్యాలయం కోరింది.



