నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రాత్రివేళ వీధి శునకాలు, పశువులకు ప్రమాదాలు తగ్గించేందుకు సేస్ సంస్థ ఆధ్వర్యంలో రిఫ్లెక్టింగ్ రేడియం మెడ బ్యాండ్లను సోమవారం వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్‌కు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 5,000 బ్యాండ్లు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు జయసూర్య తెలిపారు. తొలి విడతగా నెల్లూరుకు 250 బ్యాండ్లు అందించినట్లు చెప్పారు. ఏపీసీఆర్డీఏ భాగస్వామ్యంతో అమరావతి–విజయవాడ ప్రాంతాల్లో ఇప్పటికే 1,000 వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, ట్రస్ట్ సభ్యులు మేఘ వర్షిణి, శరవణన్, ఉషా, విజయలక్ష్మి పాల్గొన్నారు.

రాత్రి ప్రమాదాల నివారణకు వీధి జంతువులకు రేడియం మెడ బ్యాండ్లు పంపిణీ