రాజంపేటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలు
రాజంపేట: కడప జిల్లా రాజంపేటలో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ వేడుకలను అన్నమయ్య ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు జ్యోతి సాయికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జ్యోతి సాయికుమార్ మాట్లాడుతూ.. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి సందర్భంలోనూ ఫొటోకు సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఫొటోగ్రఫీ వృత్తిపై ఆధారపడిన వారిని ప్రభుత్వం గుర్తించి, సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవాలని కోరారు.అనంతరం యూనియన్ సలహాదారుడు రమణ సహకారంతో పేదలకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిన్నయ్య, కోశాధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి సుబ్బు, జాయింట్ సెక్రటరీ సురేంద్ర, సభ్యులు సునీల్, రమేష్, శ్రీను, నరేంద్ర, మనోజ్, రమణ, కిషోర్, నగేష్, మాజీ అధ్యక్షులు మందా సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.


