Monday, 17 August 2026
  • Home  
  • మూడవ రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక…
- BHUPALPALLE

మూడవ రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక…

భూపాలపల్లి ఏరియాలోని కృష్ణ కాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య నాటకోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటికను అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్‌కు చెందిన కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా ఎస్.ఓ.టు.జి.ఎం. డి. శ్యాంసుందర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుని మరియు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నాటిక ప్రదర్శనను ప్రారంభించారు. ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటికలో గౌతమ బుద్ధుని జీవితం, ఆయన బోధనలు, మానవతా విలువలు, అహింస, శాంతి, కరుణ, సమానత్వం, సత్యం, ఆత్మపరిశీలన వంటి అంశాలను కళాకారులు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. రాజభోగాలను త్యజించి మానవాళి బాధలకు పరిష్కారం కోసం సత్యాన్వేషణలో పయనించిన బుద్ధుని జీవిత ప్రయాణాన్ని నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. నాటికలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ముఖ్యంగా కోపం, ద్వేషం, హింసలకు దూరంగా ఉండి ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో నడవాలనే బుద్ధుని సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో శాంతి, సహనం, మానవత్వం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నాటిక చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అధికార ప్రతినిధి విశ్రాంత్ కుమార్ గుర్తింపు సంఘం ఏ ఐ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిథ్య సంఘం ఐ‌ఎన్‌టి‌యూ‌సి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి .మధుకర్ రెడ్డి, భూపాలపల్లి cmoia అధ్యక్షులు ఎండి నజీర్, ఎస్‌టి ఎస్‌సి ,బీసీ లైసన్ ఆఫీసర్ లు మరియు అధ్యక్షులు ఇతర ఎస్‌టి ,ఎస్‌సి ,బి‌సి యూనియన్ నాయకులు ఉద్యోగులు ,విద్యార్థులు , సేవ సబ్యులు ,ప్రజలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు

భూపాలపల్లి ఏరియాలోని కృష్ణ కాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య నాటకోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటికను అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్‌కు చెందిన కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా ఎస్.ఓ.టు.జి.ఎం. డి. శ్యాంసుందర్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుని మరియు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నాటిక ప్రదర్శనను ప్రారంభించారు.

‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటికలో గౌతమ బుద్ధుని జీవితం, ఆయన బోధనలు, మానవతా విలువలు, అహింస, శాంతి, కరుణ, సమానత్వం, సత్యం, ఆత్మపరిశీలన వంటి అంశాలను కళాకారులు ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. రాజభోగాలను త్యజించి మానవాళి బాధలకు పరిష్కారం కోసం సత్యాన్వేషణలో పయనించిన బుద్ధుని జీవిత ప్రయాణాన్ని నాటిక రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు.

నాటికలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ముఖ్యంగా కోపం, ద్వేషం, హింసలకు దూరంగా ఉండి ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో నడవాలనే బుద్ధుని సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో శాంతి, సహనం, మానవత్వం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఈ నాటిక చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ అధికార ప్రతినిధి విశ్రాంత్ కుమార్ గుర్తింపు సంఘం ఏ ఐ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిథ్య సంఘం ఐ‌ఎన్‌టి‌యూ‌సి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి .మధుకర్ రెడ్డి, భూపాలపల్లి cmoia అధ్యక్షులు ఎండి నజీర్, ఎస్‌టి ఎస్‌సి ,బీసీ లైసన్ ఆఫీసర్ లు మరియు అధ్యక్షులు ఇతర ఎస్‌టి ,ఎస్‌సి ,బి‌సి యూనియన్ నాయకులు ఉద్యోగులు ,విద్యార్థులు , సేవ సబ్యులు ,ప్రజలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.