Saturday, 3 October 2026
తిరుపతి

శ్రీకాళహస్తిలో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్-88 మంది గంజాయి విక్రేతల అరెస్ట్, వాహనాలు స్వాధీనం

శ్రీ కాళహస్తి, ఆగస్టు 16, (పున్నమి న్యూస్): జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజా భద్రతే ధ్యేయంగా ఆదివారం తెల్లవారుజామున 5:00 నుండి 7:30 గంటల వరకు 155 మంది పోలీస్ సిబ్బందితో ఎన్టీఆర్ నగర్, కొండమిట్ట ప్రాంతాల్లో విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు డిఎస్పి నరసింహమూర్తి తెలిపారు. ఈ తనిఖీల్లో రౌడీషీటర్లు, అనుమానితుల ఇళ్లను సోదా చేసి, సరైన పత్రాలు లేని 170 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలను సీజ్ చేశారు. నేరాల నిర్మూలనలో భాగంగా ఇప్పటివరకు 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 88 మందిని అరెస్ట్ చేశామని, పలువురిపై పిడి యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు రోడ్డు భద్రతపై పాఠశాలలు, కళాశాలల్లో 70కి పైగా అవగాహన సదస్సులు నిర్వహించామని, అసాంఘిక శక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ప్రజలు వెంటనే 100, 112, 1091, 1092, 181 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని డిఎస్పి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.