*శ్రీ సిటీలో టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో భారీ పేలుడు* *నైట్ షిఫ్ట్ కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం.. భారీ ప్రాణనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా* *శ్రీ సిటీ, అక్టోబర్ 3 (ప్రజా అంతరంగం) రిపోర్టర్ కిరణ్* తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నట్లు తెలిసింది.పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. నైట్ షిఫ్ట్ విధుల్లో ఉన్న కార్మికులు కూడా పేలుడు సమయంలో పరిశ్రమలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నప్పటికీ, అధికారికంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.పేలుడు సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి సంఖ్య, ప్రాణనష్టంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


