*రామచంద్రపురం:* ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారి వాజపేయి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టువాడ హరిబాబు అధ్యక్షతన వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దేశానికి వాజపేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పరిపాలనలో జాతీయ రహదారుల నిర్మాణంతో భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి స్మరణీయం. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆయన మాటలకు ముగ్ధులయ్యేవారు. ఆయన మాటలు ఎప్పుడూ సందేశాత్మకంగా ఉండేవి. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వి. మురళి, శివ, రామకృష్ణ, వీరబాబు తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

రామచంద్రపురంలో వాజపేయి వర్ధంతి ఘనంగా
*రామచంద్రపురం:* ఈరోజు రామచంద్రపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారి వాజపేయి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టువాడ హరిబాబు అధ్యక్షతన వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి వాజపేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పరిపాలనలో జాతీయ రహదారుల నిర్మాణంతో భారతదేశ అభివృద్ధికి చేసిన కృషి స్మరణీయం. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆయన మాటలకు ముగ్ధులయ్యేవారు. ఆయన మాటలు ఎప్పుడూ సందేశాత్మకంగా ఉండేవి. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి వి. మురళి, శివ, రామకృష్ణ, వీరబాబు తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

