Monday, 17 August 2026
  • Home  
  • కర్రి చిట్టిబాబు 10వ సారి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియామకం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కర్రి చిట్టిబాబు 10వ సారి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియామకం

రామచంద్రపురం:* బిజెపి సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు 10వ సారి బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా నియమితులయ్యారు. వారికి స్థానిక బిజెపి నాయకులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ద్రాక్షారామ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల బిజెపి అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు మాట్లాడుతూ 44 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో ఉంటూ ఎన్నో పార్టీ బాధ్యతలు స్వీకరించి పార్టీకి విశేష సేవలందించిన సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు అభినందనీయులని, పార్టీకి అంకితభావంతో క్రమశిక్షణగా పనిచేసిన ఆయన 10 మంది రాష్ట్ర బిజెపి అధ్యక్షుల దగ్గర 10 సార్లు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా పనిచేసిన ఘనత చిట్టిబాబుదని కొనియాడారు. చిట్టిబాబు మాట్లాడుతూ పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేశానని, ఇక ముందు కూడా పార్టీ కోసం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా యువత రాజకీయాలలోకి రావాలని కోరారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పి.ఎన్.వి. మాధవ్, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్, ఎం.ఎల్.సి సోము వీర్రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు గానాల కల్యాణ్, ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్, ఉపాధ్యక్షులు మణికంఠ, మండల ఓబిసి అధ్యక్షులు ఇంధన సత్యనారాయణ, వీరబాబు తదితర బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.