Wednesday, 2 September 2026
  • Home  
  • మహాలక్ష్మి ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
- నిర్మల్

మహాలక్ష్మి ఆలయంలో హుండీ చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి తానూర్ మండలం మొగిలి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు చోరీ చేసిన కేసులో నిందితుడిని తానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, మొగిలి గ్రామానికి చెందిన సిద్దులోళ్ల లక్ష్మణ్ (40) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన లక్ష్మణ్, తన వద్ద డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 27-08-2026 తెల్లవారుజామున సుమారు 02:00 గంటలకు మొగిలి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి, ఎవరూ లేని సమయంలో హుండీని బలంగా లాగి తెరిచి అందులో ఉన్న సుమారు రూ.5,000 నగదును చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులను విచారించి, ఘటన జరిగిన సమయంలో గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తుల గురించి ఆరా తీశారు. గ్రామస్తుల నుంచి సేకరించిన సమాచారం మరియు వారి వాంగ్మూలాల ఆధారంగా లక్ష్మణ్‌పై అనుమానం రావడంతో, పోలీసులు అతని ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో లక్ష్మణ్ మహాలక్ష్మి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన నగదును మద్యం సేవించడానికి ఖర్చు చేసినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తానూర్ పోలీసులు తెలిపారు.

ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి

తానూర్ మండలం మొగిలి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు చోరీ చేసిన కేసులో నిందితుడిని తానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, మొగిలి గ్రామానికి చెందిన సిద్దులోళ్ల లక్ష్మణ్ (40) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన లక్ష్మణ్, తన వద్ద డబ్బులు లేకపోవడంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో 27-08-2026 తెల్లవారుజామున సుమారు 02:00 గంటలకు మొగిలి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయానికి వెళ్లి, ఎవరూ లేని సమయంలో హుండీని బలంగా లాగి తెరిచి అందులో ఉన్న సుమారు రూ.5,000 నగదును చోరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

చోరీ జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులను విచారించి, ఘటన జరిగిన సమయంలో గ్రామంలో అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తుల గురించి ఆరా తీశారు. గ్రామస్తుల నుంచి సేకరించిన సమాచారం మరియు వారి వాంగ్మూలాల ఆధారంగా లక్ష్మణ్‌పై అనుమానం రావడంతో, పోలీసులు అతని ఇంటికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

పోలీసుల విచారణలో లక్ష్మణ్ మహాలక్ష్మి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదు చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన నగదును మద్యం సేవించడానికి ఖర్చు చేసినట్లు తెలిపాడు.

నిందితుడిని అరెస్ట్ చేసి, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తానూర్ పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.