మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉల్లి రైతులు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) నేతృత్వంలో ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాల్ రూ.1,580 మద్దతు ధరపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కనీస ధర రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ ఇటీవల ఇటలీ ప్రధానికి చాక్లెట్లు ఇవ్వడంపై రోహిత్ పవార్ వ్యంగ్యంగా స్పందిస్తూ, ప్రధాని ఉల్లిపాయలను బహుమతిగా ఇస్తే వాటి ధరలు కూడా పెరుగుతాయని విమర్శించారు.

మహారాష్ట్రలో రోడ్డెక్కిన ఉల్లి రైతులు