షిమ్లాలో గత ఏడాది మేలో కొండచరియలు విరిగిపడి నరీందర్ సింగ్ అనే వ్యక్తి ఆపిల్ తోట తీవ్రంగా దెబ్బతింది. అనాలోచిత నిర్మాణాలే దీనికి కారణమంటూ బాధితుడు ఎన్‌జీటీని ఆశ్రయించారు. మొదట్లో దీనిని ‘దేవుడి చర్య’గా అభివర్ణిస్తూ పరిహార బాధ్యతను నిరాకరించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది.
ప్రభుత్వ అంచనాల అనంతరం, బాధిత కుటుంబానికి రూ.1.80 కోట్ల పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా దెబ్బతిన్న వ్యవసాయ భూమి కొనుగోలుతో పాటు, నష్టపోయిన 440 ఆపిల్ చెట్లకు పరిహారం చెల్లిస్తారు


