మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు
తుర్కయాంజాల్‌లో వర్ధంతి కార్యక్రమం.. ఇబ్రహీంపట్నంలో నిరుపేదలకు రేషన్ కిట్ల పంపిణీ
తుర్కయాంజాల్, సెప్టెంబర్ 2:
మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ఆయనను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు.
అనంతరం ఇబ్రహీంపట్నంలో జ్యోతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించి, అవసరమైన నిరుపేదలకు రేషన్ కిట్లను పంపిణీ చేశారు. మహానేత వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, జ్యోతి ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
లిక్కి వెంకట్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి




