శ్రీకాళహస్తి, మే 13 (పున్నమి టెంపుల్ న్యూస్): నెల్లూరు సమీపంలోని కిసాన్ సెజ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మహానాడు’ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం బుధవారం వైభవంగా జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తిరుపతి పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు, మహానాడు వసతుల కమిటీ సభ్యులు రంగినేని చెంచయ్య నాయుడు చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వసతి, భోజనం, తాగునీరు, రవాణా తదితర ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో కలిసి ఆయన సమగ్రంగా చర్చించారు. మహానాడును పార్టీ ప్రతిష్టకు తగిన విధంగా విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి మహానాడు వేదికగా నిలవనుందని నాయకులు అభిప్రాయపడగా, కార్యక్రమ ఏర్పాట్లను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు.

మహానాడు విజయానికి సమిష్టి కృషి అవసరం-రంగినేని చెంచయ్య నాయుడు