ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాల్గొన్న వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా చేనేత అధ్యక్షుడు ఆశం సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడం, నేతన్నల సంక్షేమానికి సంబంధించిన జీవోలను అమలు చేయడం హర్షణీయమన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేతన్నలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మనుబోలులో ఘనంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 7 (పున్నమి ప్రతినిధి) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పాల్గొన్న వారికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా చేనేత అధ్యక్షుడు ఆశం సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడం, నేతన్నల సంక్షేమానికి సంబంధించిన జీవోలను అమలు చేయడం హర్షణీయమన్నారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేతన్నలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు చేనేత కార్మికులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

