Sunday, 28 June 2026
  • Home  
  • మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలి లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి
- ఖమ్మం

మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలి లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి

మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలి లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కార్పోరేట్స్ కార్పోరేట్స్ కు ఊడిగం చేస్తున్న ప్రధాని మోడీ మోడీ జేబు సంస్థలుగా మారిన రాజ్యాంగ వ్యవస్థలు కార్మిక, కర్షక ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి సిపిఐ(ఎం) జిల్లా రాజకీయ అకడమిక్ సెల్ కన్వీనర్ బండారు రమేష్, అకడమిక్ సెల్ బాధ్యులు బోడపట్ల రవీందర్. జూన్ 28 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రజలు సంఘటితంగా పోరాడాలని సిపిఐ(ఎం) జిల్లా రాజకీయ అకడమిక్ సెల్ కన్వీనర్ బండారు రమేష్, జిల్లా అకాడమిక్ సెల్ బాధ్యులు బోడపట్ల రవీందర్ అన్నారు. సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్కుర్ మండలం తిమ్మరావుపేట గ్రామంలోని మోతుకూరి గార్డెన్స్ లో నిర్వహిస్తున్న రెండవ రోజు రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆదివారం ఉదయం “మతోన్మాదం- ప్రతిఘటన” అంశాన్ని బోడపట్ల రవీందర్, మధ్యాహ్నం “ద్రవ్య పెట్టుబడి – సామ్రాజ్యవాదం” అంశాన్ని బండారు రమేష్ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ సంస్థలు తమ లాభాల కోసం మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మోడీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, కార్మికుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కార్పోరేట్ సంస్థలు, మతోన్మాద శక్తుల మధ్య ఉన్న సంబంధం రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రికృతం అవుతుందని, కార్పొరేట్లు సంపద విపరీతంగా పెరిగిపోతోందని, ధనవంతులు మరీ ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, రోజు రోజుకు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయత్నాలను తిప్పి కొట్టాలని, లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు రాజకీయంగా మరింత అవగాహనతో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన లౌకిక ప్రజాస్వామ్య సమానత్వ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య వాదులందరూ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాజకీయ శిక్షణా తరగతులకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరరావు, ఏన్కూరు, కొణిజర్ల, సింగరేణి, వైరా రూరల్, కామేపల్లి మండలాల కార్యదర్శులు దొంతెబోయిన నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, కుందనపల్లి నరెంద్ర, బాణాల శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ఏల్పుల రాములు, ఇటికల లెనిన్, కాలసాని సాయి, రేగళ్ళ తిరుమలరావు, షేక్ జానీ, కాట్రేల బిక్షం, భూక్యా లచ్చు, డివిజన్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలి

లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలి

మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కార్పోరేట్స్

కార్పోరేట్స్ కు ఊడిగం చేస్తున్న ప్రధాని మోడీ

మోడీ జేబు సంస్థలుగా మారిన రాజ్యాంగ వ్యవస్థలు

కార్మిక, కర్షక ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి

సిపిఐ(ఎం) జిల్లా రాజకీయ అకడమిక్ సెల్ కన్వీనర్ బండారు రమేష్, అకడమిక్ సెల్ బాధ్యులు బోడపట్ల రవీందర్.

జూన్ 28 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:

మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించాలని, భారత రాజ్యాంగ స్ఫూర్తిని, లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రజలు సంఘటితంగా పోరాడాలని సిపిఐ(ఎం) జిల్లా రాజకీయ అకడమిక్ సెల్ కన్వీనర్ బండారు రమేష్, జిల్లా అకాడమిక్ సెల్ బాధ్యులు బోడపట్ల రవీందర్ అన్నారు. సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్కుర్ మండలం తిమ్మరావుపేట గ్రామంలోని మోతుకూరి గార్డెన్స్ లో నిర్వహిస్తున్న రెండవ రోజు రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆదివారం ఉదయం “మతోన్మాదం- ప్రతిఘటన” అంశాన్ని బోడపట్ల రవీందర్, మధ్యాహ్నం “ద్రవ్య పెట్టుబడి – సామ్రాజ్యవాదం” అంశాన్ని బండారు రమేష్ బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ సంస్థలు తమ లాభాల కోసం మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, మోడీ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, కార్మికుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కార్పోరేట్ సంస్థలు, మతోన్మాద శక్తుల మధ్య ఉన్న సంబంధం రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని హెచ్చరించారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రికృతం అవుతుందని, కార్పొరేట్లు సంపద విపరీతంగా పెరిగిపోతోందని, ధనవంతులు మరీ ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, రోజు రోజుకు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయత్నాలను తిప్పి కొట్టాలని, లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు రాజకీయంగా మరింత అవగాహనతో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన లౌకిక ప్రజాస్వామ్య సమానత్వ విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. లౌకిక, ప్రజాస్వామ్య వాదులందరూ బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాజకీయ శిక్షణా తరగతులకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరరావు, ఏన్కూరు, కొణిజర్ల, సింగరేణి, వైరా రూరల్, కామేపల్లి మండలాల కార్యదర్శులు దొంతెబోయిన నాగేశ్వరరావు, చెరుకుమల్లి కుటుంబరావు, కుందనపల్లి నరెంద్ర, బాణాల శ్రీనివాసరావు, అంబటి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు ఏల్పుల రాములు, ఇటికల లెనిన్, కాలసాని సాయి, రేగళ్ళ తిరుమలరావు, షేక్ జానీ, కాట్రేల బిక్షం, భూక్యా లచ్చు, డివిజన్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.