ధరణి స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంలోని 22ఏ నిబంధనలతో తలెత్తుతున్న వివాదాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. భూ భారతి 22ఏ నిబంధనల వల్ల ప్రజలు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భూ సమస్యల పరిష్కారానికి బీజేపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.



