ఖమ్మం: 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా ప్రతి భారతీయ పౌరుడికి బీజేపీ ట్రేడింగ్ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఉప్పల శారద శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆమె అన్నారు. దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. భారతదేశం ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా పున్నమి దినపత్రిక యాజమాన్యానికి, పాఠకులకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఉప్పల శారద తెలిపారు. దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


