Saturday, 15 August 2026
  • Home  
  • SIR-2026 ప్రక్రియలో ముందంజలో మూడు చింతలపల్లి మండలం
- మేడ్చల్ – మల్కాజిగిరి

SIR-2026 ప్రక్రియలో ముందంజలో మూడు చింతలపల్లి మండలం

రికార్డు స్థాయిలో 88.10% నమోదు – తహసీల్దార్ ఇడ్రీస్‌కు భాజపా నాయకుల ఘన సత్కారం ​మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్): మేడ్చల్ రూరల్ జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR)-2026 ప్రక్రియలో మూడు చింతలపల్లి మండలం విశేష ప్రతిభ కనబరిచింది. రికార్డు స్థాయిలో 88.10% నమోదు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి గర్వకారణంగా మారింది. ​ఈ సందర్భంగా, ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన మూడు చింతలపల్లి తహసీల్దార్ శ్రీ ఇడ్రీస్ గారిని మేడ్చల్ నియోజకవర్గ బిజెపి (MCP@BJP) అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్ తమ బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటరు జాబితా పారదర్శకతకు కృషి చేసిన తహసీల్దార్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ​”ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన ఓటరు జాబితా రూపకల్పన అత్యంత కీలకమైనది. రికార్డు స్థాయిలో ఎస్‌ఐఆర్ నమోదు పూర్తి చేసిన అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.” – తప్పెట్ల నరేందర్ గౌడ్ (మండల భాజపా అధ్యక్షులు) ​ఈ కార్యక్రమంలో భాజపా మండల ఇంచార్జ్ గాలి సంపత్ యాదవ్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రికార్డు స్థాయిలో 88.10% నమోదు – తహసీల్దార్ ఇడ్రీస్‌కు భాజపా నాయకుల ఘన సత్కారం

​మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్):
మేడ్చల్ రూరల్ జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR)-2026 ప్రక్రియలో మూడు చింతలపల్లి మండలం విశేష ప్రతిభ కనబరిచింది. రికార్డు స్థాయిలో 88.10% నమోదు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి గర్వకారణంగా మారింది.
​ఈ సందర్భంగా, ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన మూడు చింతలపల్లి తహసీల్దార్ శ్రీ ఇడ్రీస్ గారిని మేడ్చల్ నియోజకవర్గ బిజెపి (MCP@BJP) అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్ తమ బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటరు జాబితా పారదర్శకతకు కృషి చేసిన తహసీల్దార్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
​”ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన ఓటరు జాబితా రూపకల్పన అత్యంత కీలకమైనది. రికార్డు స్థాయిలో ఎస్‌ఐఆర్ నమోదు పూర్తి చేసిన అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.”
– తప్పెట్ల నరేందర్ గౌడ్ (మండల భాజపా అధ్యక్షులు)
​ఈ కార్యక్రమంలో భాజపా మండల ఇంచార్జ్ గాలి సంపత్ యాదవ్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.