Thursday, 24 September 2026
  • Home  
  • భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పాఠశాలలకు సెలవు.!
- అనకాపల్లి

భారీ వర్షాల ఎఫెక్ట్.. రేపు పాఠశాలలకు సెలవు.!

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో) అనకాపల్లి, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24, గురువారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవును కాంపెన్సేటరీ హాలిడే గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో)

అనకాపల్లి, సెప్టెంబర్ 23: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 24, గురువారం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవును కాంపెన్సేటరీ హాలిడే గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
భారీ వర్షాల కారణంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలు ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.