వినాయక చవితి సందర్భంగా రాజంపేటలోని రాజీవ్‌నగర్ GMC క్లబ్ బ్యాక్‌సైడ్ వద్ద వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గడికోట సుబ్బారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో వినాయకుడి విగ్రహం వద్ద పటాకులను స్పాన్సర్ చేయడంతో పాటు మహిళలకు జాకెట్లు, పసుపు-కుంకుమ అందజేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన గడికోట సుబ్బారెడ్డి నీ నిర్వాహకులు ఘనంగా సన్మానించి, సాదరంగా స్వాగతం పలికారు. భక్తి కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
గణపయ్య ఆశీస్సులతో వినాయక చవితి వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా విజయవంతమయ్యాయి. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సమృద్ధులు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సారా రాజేష్, కోటపాటి నాగరాజు, సారా వెంకట సుబ్బయ్య, వడ్ల వెంకటయ్య, కోటపాటి అనీల్, కోటపాటి వినయ్, కిరణ్, మధు, నాగూర్, కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
గడికోట సుబ్బారెడ్డి అన్నగారికి నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



