Saturday, 5 September 2026
  • Home  
  • బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర సహ కన్వీనర్‌గా కృష్ణమోహన్, మహబూబ్‌నగర్ జిల్లా సహ కన్వీనర్‌గా బీ. లాలు నియామకం
- రంగారెడ్డి

బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర సహ కన్వీనర్‌గా కృష్ణమోహన్, మహబూబ్‌నగర్ జిల్లా సహ కన్వీనర్‌గా బీ. లాలు నియామకం

పున్నమి: మహబూబ్‌నగర్ జిల్లా: బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర సహ కన్వీనర్‌గా కృష్ణమోహన్‌ను, మహబూబ్‌నగర్ జిల్లా సహ కన్వీనర్‌గా బీ. లాలను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గురువు సమక్షంలో కేంద్ర అధ్యక్షుడు శివ చేతుల మీదుగా ఇరువురు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర సహ కన్వీనర్‌గా నియమితులైన కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్‌ను కుల, రాజకీయ పార్టీలకు అతీతంగా విస్తరించి, సంఘ నిర్మాణ కార్యక్రమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా సహ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన బీ. లాలు మాట్లాడుతూ.. హిందూ సమాజంలో ఉన్న కొన్ని వివక్షలు, సామాజిక అసమానతల కారణంగా కొంతమంది ఇతర మతాల వైపు వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు అవసరమైన సామాజిక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, హిందూ మతం, సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పించి, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి బీ. లాలు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి: మహబూబ్‌నగర్ జిల్లా: బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర సహ కన్వీనర్‌గా కృష్ణమోహన్‌ను, మహబూబ్‌నగర్ జిల్లా సహ కన్వీనర్‌గా బీ. లాలను నియమించారు. మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ గురువు సమక్షంలో కేంద్ర అధ్యక్షుడు శివ చేతుల మీదుగా ఇరువురు నియామక పత్రాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర సహ కన్వీనర్‌గా నియమితులైన కృష్ణమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్‌ను కుల, రాజకీయ పార్టీలకు అతీతంగా విస్తరించి, సంఘ నిర్మాణ కార్యక్రమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర నాయకత్వం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని అన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా సహ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన బీ. లాలు మాట్లాడుతూ.. హిందూ సమాజంలో ఉన్న కొన్ని వివక్షలు, సామాజిక అసమానతల కారణంగా కొంతమంది ఇతర మతాల వైపు వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితులను అరికట్టేందుకు అవసరమైన సామాజిక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు, హిందూ మతం, సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పించి, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి బీ. లాలు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.