శ్రీకాళహస్తి, జూన్ 12, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన బొక్కసంపాళ్యం శ్రీ కామాక్షి అంబ సమేత శ్రీ కోదండ రామేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్ శ్రీ కోదండ రామేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించారు. ఈ వేడుకలో భాగంగా నూతనంగా ప్రతిష్ఠించిన ప్రదోష ఉత్సవమూర్తులు, నంది వాహనాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ప్రారంభించారు. అనంతరం ప్రదోషకాలంలో ఉత్సవమూర్తులను నంది వాహనంపై గ్రామ వీధుల్లో వైభవంగా ఊరేగించగా భక్తులు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణలు, శివనామస్మరణల మధ్య జరిగిన ఈ ఉత్సవం భక్తి వాతావరణాన్ని సృష్టించింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.కె. వెంకటేశులు, ఏఓ హేమమాలిని, గుమస్తా లక్ష్మయ్య, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బొక్కసంపాళ్యంలో వైభవంగా ప్రదోష మహోత్సవం