Saturday, 18 July 2026
  • Home  
  • బొక్కసంపాళెం కోదండరామేశ్వరాలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి-గ్రామస్తుల విన్నపం
- తిరుపతి

బొక్కసంపాళెం కోదండరామేశ్వరాలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి-గ్రామస్తుల విన్నపం

శ్రీ కాళహస్తి, జులై 17, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం గ్రామంలోని చారిత్రాత్మక శ్రీ కామాక్ష్యంబ సమేత శ్రీ కోదండరామేశ్వర స్వామి ఆలయానికి రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. చోళులు, పల్లవుల కాలం నాటి ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధాలయంగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ, పర్యాటక శాఖ సంయుక్తంగా గుడిమల్లం ఆలయం నుండి శ్రీకాళహస్తి వరకు తొండమాన్‌పురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా రోజుకు మూడు విడతలుగా బస్సు సర్వీసును నడుపుతున్నాయి. ఈ తొండమాన్‌పురం నుండి కేవలం అర కిలోమీటరు దూరంలోనే ఉన్న బొక్కసంపాళెం కోదండరామేశ్వర ఆలయాన్ని కూడా ఈ సర్వీసులో సందర్శించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ, ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి ఈ రవాణా సౌకర్యం కల్పిస్తే, భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కలగడమే కాకుండా, ఈ పురాతన ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు, ఆలయ సేవకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.