శ్రీ కాళహస్తి, జులై 17, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాళెం గ్రామంలోని చారిత్రాత్మక శ్రీ కామాక్ష్యంబ సమేత శ్రీ కోదండరామేశ్వర స్వామి ఆలయానికి రవాణా సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. చోళులు, పల్లవుల కాలం నాటి ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థాన అనుబంధాలయంగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ, పర్యాటక శాఖ సంయుక్తంగా గుడిమల్లం ఆలయం నుండి శ్రీకాళహస్తి వరకు తొండమాన్పురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా రోజుకు మూడు విడతలుగా బస్సు సర్వీసును నడుపుతున్నాయి. ఈ తొండమాన్పురం నుండి కేవలం అర కిలోమీటరు దూరంలోనే ఉన్న బొక్కసంపాళెం కోదండరామేశ్వర ఆలయాన్ని కూడా ఈ సర్వీసులో సందర్శించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ, ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి ఈ రవాణా సౌకర్యం కల్పిస్తే, భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కలగడమే కాకుండా, ఈ పురాతన ఆలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని గ్రామస్తులు, ఆలయ సేవకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బొక్కసంపాళెం కోదండరామేశ్వరాలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి-గ్రామస్తుల విన్నపం