గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సేవలందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం మంజూరు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు, నాయకులు గ్రామ సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలను భవిష్యత్ తరాలకు గుర్తుండేలా చేయాలని వారు తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సర్పంచ్, గ్రామ కార్యదర్శిని కోరారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సేవలకు గుర్తుగా విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష గ్రామ ప్రజల్లో ఉందని, అందుకు అధికారులు సానుకూలంగా స్పందించి స్థలం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్కే యాకుబ్ పాషా మాజీ సర్పంచ్ కాసా ప్రవీణ్ కుమార్ మాజీ ఎంపిటిసి మౌలానా గ్రామ ఉపసర్పంచ్ సింగ్ సుధాకర్ వార్డ్ నెంబర్ ఎస్.కె రహీం మాజీ అధ్యక్షుడు నేలమారి నాగరాజ్. సుధ గాని మురళి. వేల్పుల లింగయ్య. అల్లావుద్దీన్.లెట్స్ గో జానీ. ఫయాజ్ .నూరుద్దీన్. తదితరులు పాల్గొన్నారు.



