ఎమ్మిగనూరులో ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు కొండాపురి ఇషాక్ గారి సోదరుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డా. బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి గారు, కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు శేఖరన్న గారితో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతికి సంతాపం తెలిపారు. బాధలో ఉన్న కుటుంబానికి తాము అండగా ఉంటామని, పార్టీ పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి గారు, శేఖరన్న గారు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
