Friday, 4 September 2026
  • Home  
  • బీజేపీపై కాంగ్రెస్‌ వ్యాఖ్యలను ఖండించిన మానేపల్లి అయ్యాజి వేమ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బీజేపీపై కాంగ్రెస్‌ వ్యాఖ్యలను ఖండించిన మానేపల్లి అయ్యాజి వేమ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ మండలి సభ్యుడు మానేపల్లి అయ్యాజి వేమ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ నాయకత్వం అభివృద్ధి, సామాజిక పురోగతికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్‌ వారసత్వాన్ని గత ప్రభుత్వాలు సరైన రీతిలో గౌరవించలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్‌ జీవితంతో ముడిపడిన ఐదు ప్రాంతాలను ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేసిందన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను గౌరవించడంలో బీజేపీ ముందుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలను గ్రహించి అసత్య ప్రచారాలకు స్వస్తి పలకాలని అయ్యాజి వేమ సూచించారు. Uploaded Video:

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ మండలి సభ్యుడు మానేపల్లి అయ్యాజి వేమ కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ నాయకత్వం అభివృద్ధి, సామాజిక పురోగతికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్‌ వారసత్వాన్ని గత ప్రభుత్వాలు సరైన రీతిలో గౌరవించలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్‌ జీవితంతో ముడిపడిన ఐదు ప్రాంతాలను ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేసిందన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను గౌరవించడంలో బీజేపీ ముందుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోకుండా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలను గ్రహించి అసత్య ప్రచారాలకు స్వస్తి పలకాలని అయ్యాజి వేమ సూచించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.