బీజేపీ ట్రేడర్స్ సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా ఉప్పల శారదమ్మా నూతన బాధ్యతలు స్వీకరించి తొలి సారిగా ఖమ్మం వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, మృత్యుంజయరావు, వేల్పుల సుధాకర్, ఆచంటి కోటేశ్వరరావు (శారధమ్మ దత్త పుత్రుడు) లు శారదమ్మ ని కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా అభినందించారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణిస్తూ వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ శారదమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు.



