నేలకొండపల్లి / ఖమ్మం
బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నేలకొండపల్లి సీనియర్ నాయకుడు, మాజీ మండల అధ్యక్షుడు కోటి హనుమంతరావు నియమితులైన సందర్భంగా పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ నున్నా రవికుమార్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మీగడ గోపి, మూటాపురం వార్డు మెంబర్ కట్టా అప్పారావు కోటి హనుమంతరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కోసం కోటి హనుమంతరావు చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయనకు జిల్లా కార్యవర్గంలో బాధ్యతలు అప్పగించడం పార్టీ కార్యకర్తలకు ఉత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్లో కూడా పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోటి హనుమంతరావు తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.




