Thursday, 3 September 2026
  • Home  
  • బిసి విద్యార్థుల స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి :Trp
- జనగాం

బిసి విద్యార్థుల స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి :Trp

బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి:, పిట్టల సురేష్ టి ఆర్ పి జిల్లా యూత్ అధ్యక్షులు,విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ ——————————————————————– బీసీలపై ఎందుకు ఇంత కక్ష? విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ డిమాండ్ *బీసీ విద్యార్థుల అన్యాయంపై టీఆర్పీ పార్టీ నల్ల బ్యాడ్జీల నిరసన* బీసీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు MlC తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ డిమాండ్ చేశారు. జనగామ చౌరస్తాలో బీసీ విద్యార్థుల అన్యాయంపై నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి తమ చదువులను కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వారి విద్యా భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడంతో కళాశాల ఫీజులు చెల్లించలేక, విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య ఒక హక్కు అని, ఆ హక్కును ఆర్థిక ఇబ్బందుల కారణంగా దూరం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత, బీసీల సంక్షేమం గురించి ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఆచరణలో మాత్రం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదని, ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న బీసీ స్కాలర్‌షిప్‌ల వివరాలను వెల్లడించి, అర్హులైన ప్రతి విద్యార్థి ఖాతాకు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తేలికగా తీసుకుంటే *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* చూస్తూ ఊరుకోదని, విద్యార్థుల తరఫున మరింత బలమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా యూత్ నాయకులు బాలశివుడు, విద్యార్థులు చందు, అశోక్, సంగీత, రాధిక, విజయ, ప్రణీత, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి:, పిట్టల సురేష్ టి ఆర్ పి జిల్లా యూత్ అధ్యక్షులు,విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్
——————————————————————–
బీసీలపై ఎందుకు ఇంత కక్ష? విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడొద్దు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ డిమాండ్
*బీసీ విద్యార్థుల అన్యాయంపై టీఆర్పీ పార్టీ నల్ల బ్యాడ్జీల నిరసన*
బీసీ విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఆర్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు MlC తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యూత్ అధ్యక్షులు పిట్టల సురేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపటి అజయ్ డిమాండ్ చేశారు.
జనగామ చౌరస్తాలో బీసీ విద్యార్థుల అన్యాయంపై నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి తమ చదువులను కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ విద్యార్థులపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వారి విద్యా భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
స్కాలర్‌షిప్‌లు ఆలస్యం కావడంతో కళాశాల ఫీజులు చెల్లించలేక, విద్యార్థులు తమ చదువులను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య ఒక హక్కు అని, ఆ హక్కును ఆర్థిక ఇబ్బందుల కారణంగా దూరం చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వం ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత, బీసీల సంక్షేమం గురించి ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ఆచరణలో మాత్రం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు.
విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాలకు బలి కాకూడదని, ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న బీసీ స్కాలర్‌షిప్‌ల వివరాలను వెల్లడించి, అర్హులైన ప్రతి విద్యార్థి ఖాతాకు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం తేలికగా తీసుకుంటే *తెలంగాణ రాజ్యాధికార పార్టీ* చూస్తూ ఊరుకోదని, విద్యార్థుల తరఫున మరింత బలమైన ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా యూత్ నాయకులు బాలశివుడు, విద్యార్థులు చందు, అశోక్, సంగీత, రాధిక, విజయ, ప్రణీత, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.