బి.ఎన్.రెడ్డి నగర్‌లో గంజాయి కేసు – ఇద్దరు అరెస్ట్
పున్నమి న్యూస్ ప్రతినిధి
07 మే 2026
బి.ఎన్.రెడ్డి జోన్
రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా:
బి.ఎన్.రెడ్డి నగర్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్‌పై 06-05-2026 సాయంత్రం జరిగిన వెహికల్ చెకింగ్‌లో పోలీసులు గంజాయి కేసును ఛేదించారు.
ఎస్ఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, గుర్రంగూడ వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండటం గమనించారు. వారిని ఆపేందుకు ప్రయత్నించగా, వారి వద్ద ఉన్న ఒక కవర్‌ను రోడ్డుపక్కన పడేసి పారిపోవడానికి యత్నించారు.
పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ కవర్‌లో గంజాయి ఉన్నట్లు వారు అంగీకరించారు. దీంతో వెంటనే కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
శ్యామలపల్లి కరుణ్ కుమార్
తండ్రి: ప్రభాకర్
వయసు: 32 సంవత్సరాలు
వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి
నివాసం: సూర్య సరోజ అపార్ట్మెంట్స్, హుడా కాంప్లెక్స్, సరూర్నగర్
బైలుపాటి రవికుమార్
తండ్రి: హనుమంతు
వయసు: 35 సంవత్సరాలు
వృత్తి: ప్రైవేట్ ఉద్యోగి
నివాసం: సాయి రామ్ నగర్ కాలనీ, బి.ఎన్.రెడ్డి నగర్
గంజాయి: 22 గ్రాములు
సెల్ ఫోన్లు: 2
పట్టుబడిన గంజాయి మరియు ఇతర వస్తువులను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.



