Sunday, 19 April 2026
  • Home  
  • వైభవంగా పరశురామేశ్వరాలయ కుంభాభిషేక మహోత్సవం
- తిరుపతి

వైభవంగా పరశురామేశ్వరాలయ కుంభాభిషేక మహోత్సవం

ఏర్పేడు, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( ఏర్పేడు మండలంలోని గుడిమల్లం క్షేత్రంలో పురాతనమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కుంభాభిషేకంలో భాగంగా నిర్వహించే ఏడు రోజుల క్రతువులకు తొలిరోజు వేదమంత్రాల సాక్షిగా అంకురార్పణ జరిగింది. కుంభాభిషేక కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు గ్రామ దేవత అయిన శ్రీ ఏకారమ్మ తల్లి ఆజ్ఞ తీసుకొని ఉత్సవాలను మొదలుపెట్టారు. అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. స్వామి, అమ్మవార్ల అనుగ్రహం కోసం చేసే ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి, స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ధర్మపత్ని బృందమ్మ స్వామివారికి సంబంధించిన ప్రధాన కలశాలను స్వయంగా ఆలయానికి తీసుకొచ్చి అందజేశారు. అదేవిధంగా, పట్టణ వాస్తవ్యులు అమ్మవారి కలశాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ అధికారులకు సమర్పించారు. కలశాలతో వచ్చిన బొజ్జల కుటుంబ సభ్యులకు మరియు ఇతర భక్తులకు ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం జరుగుతున్న ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయ చైర్మన్, పాలకమండలి సభ్యులు, అధికారులకు సూచించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. రాబోయే ఏడు రోజుల పాటు ఆలయంలో వివిధ హోమాలు, జపాలు, విశేష పూజలు నిర్వహించి, చివరి రోజు మహా కుంభాభిషేకంతో వేడుకలు ముగియనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.