శ్రీకాళహస్తి, ఏప్రిల్ 19 (పున్నమి న్యూస్( అణగారిన వర్గాలను అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ ద్వారానే గిరిజన సాధికారత సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యుడు యం. సుబ్బయ్య పేర్కొన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సుబ్బయ్యకు తిరుపతి పార్లమెంటు గిరిజన విభాగం నాయకుడు తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్త కోనేరు ఎస్టీ కాలనీలో గిరిజనులు ఘన సత్కారం నిర్వహించారు. పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీలలో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం సానుకూల పరిణామమని, ఈ నియామకం గిరిజన యువతకు ప్రోత్సాహకరమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన యువ గిరిజన నాయకుడు సుబ్బయ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. ఈ కార్యక్రమంలో మిన్నల్ రవి, డా. ఉమేష్ రావు, వజ్రం కిషోర్, కోట చంద్రశేఖర్, షేక్ నూర్ మొహమ్మద్, తుపాకుల ప్రసాద్, రమేష్, విశ్వనాథం, మునిరాజా, సుబ్బరత్న, మునెమ్మ, గంగా భవాని, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన సాధికారతకు టిడిపి బాటలు – సుబ్బయ్యకు ఘన సత్కారం