అనకాపల్లి జిల్లా సెప్టెంబర్ 7 ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
యలమంచిలి :శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబరు మొదటి వారంలో చేపట్టిన పోషకాహార వారోత్సవాలు ముగిశాయి. సోమవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి సోమలింగపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మోహన్ చక్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. మోహన్ చక్రీ మాట్లాడుతూ యువత తమ రోజువారి ఆహారంలో చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు మరియు గుడ్డు వంటి సమతుల పోషకాహారాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన జీవనశైలికి సరైన పోషకాహారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ పి. చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ వి.ఎస్. సత్యనారాయణ, జంతుశాస్త్ర విభాగాధిపతి కె. సుజాత, అధ్యాపకురాలు శశికళ చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.


