కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బూత్ నెం. 163లో ఓటర్ సర్వే నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి సూచనలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్వేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో BLO లావణ్య, మైలవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రకాష్, BLA తొమ్మండ్రు డేవిడ్, కో-కన్వీనర్ చిలక రాజేష్తో పాటు పలువురు నాయకులు పాల్గొని ఓటరు వివరాల పరిశీలన, నమోదు ప్రక్రియలో సహకరించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఓటరు సహకరించాలని వారు కోరారు.

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో టీడీపీ నాయకుల చురుకైన భాగస్వామ్యం