Monday, 22 June 2026
  • Home  
  • ప్రతిరోజు యోగా, ధ్యానం చేసి ఆరోగ్యవంతులుగా ఉండండి. కమిషనర్ గంగా ప్రసాద్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రతిరోజు యోగా, ధ్యానం చేసి ఆరోగ్యవంతులుగా ఉండండి. కమిషనర్ గంగా ప్రసాద్

ఆత్మకూరు : ధైనందిన జీవితంలో మనిషి యాంత్రికంగా పరుగులు పెడుతున్నారని అందువల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అందుకు భిన్నంగా నిత్యం యోగా ,ధ్యానం కు కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మునిసిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినోత్సవం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక యోగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.​ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, పట్టణ ఎక్స్ కౌన్సిలర్లు ప్రముఖులు కలిసి ఉదయాన్నే యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. ​మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ”శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుంది అన్నారు.​ఆరోగ్యమే మహాభాగ్యం: నిత్య జీవితంలో యోగా ప్రాధాన్యతను, అది మానసిక ఒత్తిడిని ఎలా దూరం చేస్తుందనే విషయాలను వివరించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు కొన్ని చోట్ల చిన్నపాటి ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలనీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగ ట్రైనర్ అనీల్ ,టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రా రెడ్డి , బిజెపి నాయకులు,కుడుముల సుధాకర్ రెడ్డి, 20వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి , టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ రెడ్డి, ఐదవ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ మహబూబ్ బాషా, 14వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ పి పెంచలయ్య, రెండవ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ శివ కోటారెడ్డి, 9వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ రమాదేవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆత్మకూరు :
ధైనందిన జీవితంలో మనిషి యాంత్రికంగా పరుగులు పెడుతున్నారని అందువల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అందుకు భిన్నంగా నిత్యం యోగా ,ధ్యానం కు కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మునిసిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా దినోత్సవం మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక యోగా శిబిరాన్ని ఏర్పాటు చేశారు.​ మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, పట్టణ ఎక్స్ కౌన్సిలర్లు ప్రముఖులు కలిసి ఉదయాన్నే యోగాసనాలు, ప్రాణాయామం చేశారు.
​మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ మాట్లాడుతూ”శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుంది అన్నారు.​ఆరోగ్యమే మహాభాగ్యం: నిత్య జీవితంలో యోగా ప్రాధాన్యతను, అది మానసిక ఒత్తిడిని ఎలా దూరం చేస్తుందనే విషయాలను వివరించారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు కొన్ని చోట్ల చిన్నపాటి ప్రదర్శనలు కూడా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలనీ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగ ట్రైనర్ అనీల్ ,టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రా రెడ్డి , బిజెపి నాయకులు,కుడుముల సుధాకర్ రెడ్డి, 20వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి , టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి పులిమి శైలజ రెడ్డి, ఐదవ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ మహబూబ్ బాషా, 14వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ పి పెంచలయ్య, రెండవ వార్డ్ ఎక్స్ కౌన్సిలర్ శివ కోటారెడ్డి, 9వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ రమాదేవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.