Saturday, 8 August 2026
  • Home  
  • వాకరోడ్డు భూసేకరణపై తహసీల్దార్‌ కె. వరహాలు స్పష్టీకరణ.. నిబంధనల మేరకే ప్రక్రియ
- అనకాపల్లి

వాకరోడ్డు భూసేకరణపై తహసీల్దార్‌ కె. వరహాలు స్పష్టీకరణ.. నిబంధనల మేరకే ప్రక్రియ

యలమంచిలి, ఆగస్టు 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): యలమంచిలి–మాకవరపాలెం (వాకరోడ్డు) విస్తరణకు చేపట్టిన భూసేకరణ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని యలమంచిలి తహసీల్దార్ కె. వరహాలు స్పష్టం చేశారు. భూసేకరణపై వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు స్వీకరించి, విచారణ అనంతరం అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా నిబంధనల మేరకే చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా వాస్తవాలను తెలుసుకోవాలని, సందేహాలుంటే రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.