గూడూరు, సెప్టెంబర్ 09:
గూడూరు నియోజక వర్గ పరిధిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ నాయకుల ఫయాజ్ కోరారు. బుధవారం పట్టణంలోని సచివాలయాలను సందర్శించిన పిదప, అర్హులైన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ
ఫించన్ల కోసం తిరగాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను ఆయన అన్నారు. ఫించన్లు అందని వారి వివరాలను గుర్తించి, నిబంధనల ప్రకారం త్వరగతిన వారికీ ఫించన్లు మంజూరు చేయాలని కోరారు.
సంక్షేమ పథకాల లక్ష్యం పేదలు, వృద్ధులు, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమేనని నాయకుల ఫయాజ్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని హితవు పలికారు.

ప్రతి ఒక్కరికీ పింఛన్ కల్పించాలి
గూడూరు, సెప్టెంబర్ 09: గూడూరు నియోజక వర్గ పరిధిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే పింఛన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు షేక్ నాయకుల ఫయాజ్ కోరారు. బుధవారం పట్టణంలోని సచివాలయాలను సందర్శించిన పిదప, అర్హులైన వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఫించన్ల కోసం తిరగాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను ఆయన అన్నారు. ఫించన్లు అందని వారి వివరాలను గుర్తించి, నిబంధనల ప్రకారం త్వరగతిన వారికీ ఫించన్లు మంజూరు చేయాలని కోరారు. సంక్షేమ పథకాల లక్ష్యం పేదలు, వృద్ధులు, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమేనని నాయకుల ఫయాజ్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని హితవు పలికారు.

