Tuesday, 18 August 2026
  • Home  
  • పోరాటాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం*
- విశాఖపట్నం

పోరాటాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం*

చట్టాల సవరణకు త్వరలో జాతీయ సదస్సు* *కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల స్థలాలు*..*పెన్షన్ సదుపాయం సాధిస్తాం* *జిల్లా మహాసభకు భారీగా తరలివచ్చిన పాత్రికేయులు* *ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు* శ్రీకాకుళం.ఆగస్టు 18. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు లు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిలు గా పాల్గొన్న వీరు మాట్లాడుతూ. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులు సమాచారాన్ని స్వేచ్ఛగా సేకరించి ప్రజలకు అందించేందుకు అనుకూలంగా ఉన్న చట్టాలను మరింత పటిష్టంగా సవరించాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, వారికి మెరుగైన భద్రత, సామాజిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ తదితర సంక్షేమ ప్రయోజనాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించేందుకు త్వరలో జాతీయస్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం ఫెడరేషన్ నిరంతరం తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు..పోరాటాల ద్వారానే జర్నలిస్టుల హక్కులు, సంక్షేమాన్ని సాధించగలమని వీరు పేర్కొన్నారు. ఈ సభకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ఫెడరేషన్ కార్యదర్శి లక్ష్మణరావు .. సీనియర్ పాత్రికేయులు ఈశ్వరరావు ..సత్తార్ భాస్కర్ రావు . డాక్టర్ ప్రసాద్ రావు చంద్రశేఖర్, ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ, జి శ్రీనివాసరావు, ఏపీ బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్.. కార్యవర్గ ప్రతినిధులు హరి ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు, హరనాధ్ తో పాటు భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు

చట్టాల సవరణకు త్వరలో జాతీయ సదస్సు*

*కూటమి ప్రభుత్వ హయాంలోనే ఇళ్ల స్థలాలు*..*పెన్షన్ సదుపాయం సాధిస్తాం*

*జిల్లా మహాసభకు భారీగా తరలివచ్చిన పాత్రికేయులు*

*ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు*

శ్రీకాకుళం.ఆగస్టు 18.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు లు అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ వంటి సంక్షేమ పథకాలు సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిలు గా పాల్గొన్న వీరు మాట్లాడుతూ. ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

జర్నలిస్టులు సమాచారాన్ని స్వేచ్ఛగా సేకరించి ప్రజలకు అందించేందుకు అనుకూలంగా ఉన్న చట్టాలను మరింత పటిష్టంగా సవరించాలని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, వారికి మెరుగైన భద్రత, సామాజిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్ తదితర సంక్షేమ ప్రయోజనాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జర్నలిస్టు సంఘాలు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించేందుకు త్వరలో జాతీయస్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం ఫెడరేషన్ నిరంతరం తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు..పోరాటాల ద్వారానే జర్నలిస్టుల హక్కులు, సంక్షేమాన్ని సాధించగలమని వీరు పేర్కొన్నారు. ఈ సభకు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్ అధ్యక్షత వహించగా ఫెడరేషన్ కార్యదర్శి లక్ష్మణరావు .. సీనియర్ పాత్రికేయులు ఈశ్వరరావు ..సత్తార్ భాస్కర్ రావు . డాక్టర్ ప్రసాద్ రావు చంద్రశేఖర్, ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ, జి శ్రీనివాసరావు, ఏపీ బ్రాడ్ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి
కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్.. కార్యవర్గ ప్రతినిధులు హరి ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు, హరనాధ్ తో పాటు భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.