వార్త ముఖ్యాంశాలు
- నర్సంపేట బీసీ ఉద్యమ నాయకుడు,బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను నర్సంపేట పట్టణంలోని తన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల…
- ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సంపేట బీసీ ల ముద్దుబిడ్డ, నర్సంపేట బీసీ ఉద్యమ నాయకుడు నర్సంపేట నియోజకవర్గంలో బీసీ వాదాన్ని గత 16సంవత్సరాలుగా అనునిత్యం బీసీ ల హక్కుల కోసం పోరాడుతున్న బీసీ ఉద్యమ నాయకుడు డ్యాగల శ్రీనన్న అని అన్నారు.
- ఇటివల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన అఖిల భారత జాతీయ 11వ బీసీ మహాసభల కార్యక్రమంలో మా ముందే ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో శ్రీనన్న తలకు మరియు కాలుకు గాయాలు కావడం చాలా బాధాకరం అని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సంపేట బీసీ ఉద్యమ నాయకుడు,బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ ను నర్సంపేట పట్టణంలోని తన నివాసంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శి నూనె రంజిత్ కుమార్ ముదిరాజ్, మొర్రి శ్రీనివాస్ కురుమ లు శ్రీనన్న ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సంపేట బీసీ ల ముద్దుబిడ్డ, నర్సంపేట బీసీ ఉద్యమ నాయకుడు నర్సంపేట నియోజకవర్గంలో బీసీ వాదాన్ని గత 16సంవత్సరాలుగా అనునిత్యం బీసీ ల హక్కుల కోసం పోరాడుతున్న బీసీ ఉద్యమ నాయకుడు డ్యాగల శ్రీనన్న అని అన్నారు. ఇటివల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన అఖిల భారత జాతీయ 11వ బీసీ మహాసభల కార్యక్రమంలో మా ముందే ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో శ్రీనన్న తలకు మరియు కాలుకు గాయాలు కావడం చాలా బాధాకరం అని బీసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా డ్యాగల శ్రీనన్న తొందరగా కోలుకుని వరంగల్ జిల్లా తో పాటు నర్సంపేట నియోజకవర్గంలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు.